ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ప్రవేశం కొరకు దరఖాస్తుల ఆహ్వానం… జ్యోతి, డిడి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ

**దరఖాస్తుల సమర్పణకు జూన్ 6 చివరి తేదీ**

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి

1వ, 5వ తరగతుల్లో ప్రవేశం కొరకు ఖమ్మం జిల్లాలోని ఎస్సీ విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి**

ఖమ్మం, మే- 19:

2026-27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్) పాఠశాలల్లో 1వ తరగతి, 5వ తరగతుల్లో ప్రవేశం కొరకు జిల్లాకు చెందిన అర్హులైన షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు జి.జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బెస్ట్ అవైలబుల్ స్కూల్ నందు 1వ తరగతి (నాన్ రెసిడెన్షియల్ / డే స్కాలర్స్) లో 128 సీట్లు, 5వ తరగతి (రెసిడెన్షియల్) లో 131 సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.

 

కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి లక్షా 50 వేలు లోపు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల లోపు ఉండాలని, తల్లిదండ్రులు డిగ్రీ లేదా అంత కంటే ఎక్కువ చదువుకుని ఉంటే అనర్హులని స్పష్టం చేశారు. 1వ తరగతి ప్రవేశం కోరే విద్యార్థులు 2020 జూన్ 1 నుండి 2021 మే 31 మధ్య జన్మించి ఉండాలని (5 నుండి 6 సంవత్సరాల లోపు), ఒక కుటుంబం నుండి ఒకరికి మాత్రమే ప్రవేశానికి అర్హత ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ ఉపకులాల వారీగా (కేటగిరి-1 కు 1 శాతం, కేటగిరి-2 కు 9శాతం, కేటగిరి-3 కు 5 శాతం) సీట్లు కేటాయించబడతాయని వివరించారు.

 

ఆసక్తి గల వారు దరఖాస్తు ఫారాలను మే 20 నుండి జూన్ 06 వరకు ఖమ్మం కలెక్టరేట్ (వెంకటాయపాలెం) లోని రూమ్ నెంబర్ S-34 లో గల షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుల వారి కార్యాలయం నుండి పొంది, పూర్తి చేసిన దరఖాస్తులను తగిన ధృవీకరణ పత్రాలతో (మీ-సేవ ద్వారా పొందిన లేటెస్ట్ కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, ఆధార్/రేషన్ కార్డు, మార్క్స్ మెమో లేదా బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు) జతపరిచి జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తిరిగి అదే కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

 

ఇతర వివరాల కొరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకుల (DD-SCDD) కార్యాలయంలో సంప్రదించాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!