ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రాష్ట్రంలో కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు..

 

పొలిటికల్ పవర్ PN9న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

హైదరాబాద్ :   కార్మికుల కనీస వేతనాల పెంపునకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నివేదిక మేరకు తీసుకున్న నిర్ణయాలను రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 1.11 కోట్ల మంది కార్మికులకు మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు. జూన్ 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రాన్ని ప్రభుత్వం మూడు జోన్లుగా విభజించింది.

 

*కార్మికుల వేతనాల పెంపు ఇలా..!!*

 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల కనీస వేతనాలు నిర్ణయించకపోవడం వల్ల 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కనీస వేతన పెంపుపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి పలు కీలక సిఫార్సులు చేసిందని వివరించారు. కార్మికులు సంతృప్తిగా ఉన్నప్పుడే ఉత్పత్తి బాగుంటుందన్నారు. అన్స్కిల్, సెమీ స్కిల్, హైస్కిల్ కేటగిరీలుగా విభజించిందన్నారు. కార్మికుల వేతనాలు నిర్ణయించేందుకు గాను జోన్లను 3 జోన్లుగా విభజించామని తెలిపారు.

*జోన్-1లో మున్సిపల్ కార్పొరేషన్లు. జోన్-2 మున్సిపాల్టీలు. జోన్-3 కింద గ్రామీణ ప్రాంతాలు ఉంటాయని* రేవంత్ రెడ్డి

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!