ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రేమ.. పెళ్లి.. మోసం..నీలదీస్తే భార్య పై దాడి చేసిన భర్త..

 

     ఆసుపత్రిలో చికిత్స       పొందుతున్న భార్య..

 

భర్త అత్తమామల నుండి ప్రాణహాని ఉందంటున్న బాధితురాలు…

పొలిటికల్ పవర్ PN9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

*లండన్ లో మాస్టర్ చేసి.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మనిషా..*

*ఫ్రెండ్ అన్నాడు..తర్వాత ప్రేమ అన్నాడు.. నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. ఇపుడు నిన్ను చంపేస్తాను అంటున్నాడు..*

*నిలదీస్తే నా వెనుక అంబర్పేట్ శంకర్ ఉన్నాడని బెదిరిస్తున్నాడు…*

తాజాగా నా భర్త అత్తింటి వారందరూ కలిసి నన్ను తీవ్రంగా కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు న్యాయం చేయాలంటూ వేడుకుంటుంది..

హైదరాబాద్ రాంపల్లికి చెందిన మనీషా లండన్ లో మాస్టర్ చేసి.. ఉద్యోగం చేసింది..

మనీషా కు ఉప్పల్ కు చెందిన సంతోష్ రెడ్డి క్లాస్ మెట్.. ఫ్రెండ్స్..

నన్ను ప్రేమిస్తున్నాను..మనం పెళ్లి చేసుకుందామని ఇండియాకు రప్పించాడు సంతోష్ రెడ్డి…

2025 లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి జరిగింది.

భారీగా ఆస్తులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్న సంతోష్ రెడ్డి..

40 తులాల బంగారం.. ఓ ఫ్లాట్ కట్నం గా ఇచ్చారు.

భార్య మనీషా కు తెలియకుండా భార్య స్నేహితులు కుటుంబ సభ్యుల వద్ద సుమారు కోటి రూపాయలు అప్పు చేసిన సంతోష్ రెడ్డి…

 

డబ్బులు అప్పు విషయంలో తరచు గొడవలు జరుగుతున్నాయి…

అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధించారు…

నన్ను అమ్మి నా అప్పులు కడతానని అత్తమామలు వేధించారు..

నన్ను మోసం చేశారని నిలదీస్తే నా వెనుక అంబర్పేట్ శంకర్ అతని అనుచరులు ఉన్నారని నన్ను నా తల్లిదండ్రులను బెదిరిస్తున్నాడు…

తాజాగా పెద్దగా మనుషుల సమక్షంలో మాట్లాడుతుండగా నాపై నా తల్లిదండ్రులపై దాడి చేశాడు..

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను..

నాకు.. నా తల్లిదండ్రులకు భర్త సంతోష్ రెడ్డిని వారి కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉంది…

పోలీసులు ప్రభుత్వం స్పందించి నాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను..

మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మనీషా తల్లిదండ్రులు…

ఆస్పత్రి నుంచి బాధితురాలు మనిషా వీడియో విడుదల…!

 

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!