భూ బకాసురుడు లింగం లీలలు బాగోతం పట్టించుకోని అధికారులు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం రెవిన్యూ లో భూ బకాసురులు పట్టించుకోని ప్రభుత్వ అధికారులు అసైన్మెంట్ ల్యాండ్ ని వెంచర్ గా మార్చి ఫ్లాట్లు చేసి ప్రజలకు ఒక్కొక్క ఫ్లాట్ ను ఇద్దరు ముగ్గురు కు అమ్మిన వైనం అయినా చోద్యం చూస్తున్న రెవెన్యూ పోలీస్ యంత్రాంగం దీని వెనక ఉన్నది ఎవరు అతని మీద ఐదు కేసులు బాధితులు పెట్టినా కూడా పట్టించుకోని ఖమ్మం రూరల్ ఏసిపి ఎందుకు ఇలా జరుగుతుంది దీని కారణం ఎవరు ప్రభుత్వం భూమిని ఫ్లాట్లుగా మార్చి సర్వే నెంబర్ ని తప్పుగా చూపిస్తూ అమాయకులకు అమ్మిన వ్యక్తులను ఎందుకు పోలీసు వారు కాపాడుతున్నారు ఒకే రకమైన కేసులు ఐదు కేసులు ఉంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తి మీద పిడి యాక్ట్ పెట్టాలని చట్టంలో ఉంది కదా ఎందుకు పెట్టట్లేదు అంటే దీని వెనక రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నడా లేక వేరే వేరే ఎవరైనా ఉన్నారా ఇలా ప్రభుత్వ భూములను కబ్జా చేసి వెంచర్లు వేసి ఫ్లాట్లు చేసి అమ్మిన వ్యక్తులను వెంటనే కస్టడీలోకి తీసుకొని కొసమెరుపు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బాధితులున్నారు ఎస్టీ, ఎస్టీ కేసులు కూడా పెట్టాలని అమాయకుల ప్రజలు వాపోతున్నారు లింగం నీ వెనకున్నది ఎవరు ? 10 సంవత్సరాల నుంచి ఈ తత్తంగమంతా నడుస్తుంటే ప్రభుత్వ అధికారులు రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతుందా లేక వాళ్లకు అందవలసినవి అందుతున్నాయి కాబట్టి ఇవి బయటకు రాకుండా ఉంటున్నట్టు పొగట్ట బాధితులు అందరూ కూడా పదిమంది కంప్లైంట్ ఇచ్చారు మరియు మరో విషయం ఏంటంటే ఇదే భూమిని ఒక్కొక్క ఫ్లాట్ ను ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేశారు వారందరూ ఇప్పుడు లబోదిబోమంటున్నారు అయినా ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారు ముదిగొండ మండలం రెవెన్యూ అధికారులు ముదిగొండ మండలం పోలీస్ యంత్రాంగం అలాగే ఖమ్మం రూరల్ ఏసిపి ఏం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఈ తత్తంగమంతా నడుస్తున్నప్పుడు ల్యాండ్ కన్వర్షన్ అని లేదా ల్యాండ్ అక్వేజేషన్ అని లేదంటే ల్యాండ్ మార్క్ చేసిన అని చెప్పి ప్రజలను చాలా గొర్రెలు పెట్టే ప్రభుత్వ అధికారులు ఈ విషయం వాళ్ళ దృష్టికి రాలేదా వెళ్లలేదా వెళ్లిన మాకు అవసరం లేదని చేతులు దులుపుకున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది కొసమెరుపు ఏంటంటే ముదిగొండ మండలం ఎమ్మార్వో మా దృష్టికి ఈ విషయం రాలేదండి అని అంటున్నారు వారికి తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయా అది సాధ్యమా కబ్జాదారుడు నుండి ఆత్మ పడుతున్న మాజీ సర్పంచ్ ఖమ్మంలో భూలక్ష్మి ంచి రాజుగారు భార్యకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సువర్ణాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 399లో 0.24 కుంటల అసైన్మెంట్ భూమి పట్టా ఇచ్చింది.ఈ భూమి ఆనుకొని ఉన్న 400 సర్వే నెంబర్ వెంకటగిరి గ్రామానికి చెందిన రేఖం లింగరాజు అలియాస్ లింగయ్య అనే వ్యక్తి తన భూమిలో వెంచర్ వేసి పక్కనే ఉన్న మహమ్మద్ రెహనా సుల్తానా వైఫ్ అజ్గర్ భూమిని కూడా కలుపుకొని వెంచర్ వేసి అమ్ముకున్నాడు ఇది తెలుసుకొని బాధితులు ఈరోజు తన భూమి అక్రమంగా చేసిన వెంచర్లో తన భూమిలొ హద్దులు పెట్టుకున్నాడు ఈ భూమి ఎస్సీ ఎస్టీ మైనార్టీ లు 24 కుంటల అసైన్మెంట్ భూమి లో 20 మంది బాధితులు మరో విషయం ఏంటంటే అసైన్మెంట్ లబ్ధిదారులకు తప్ప వేరే వాళ్ళకి అమ్మకూడదు కొనకూడదు రిజిస్ట్రేషన్ చేయకూడదని చట్టంలోనే ఉంది ఇది వెంచర్ వేసి అమాయకులకు ఫ్లాట్ల అమ్మిన వారికి తెలియదా లబో దీబో అంటూ ఎవరిని కలవాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి ఇకనైనా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముదిగొండ మండల ఎమ్మార్వో అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలని బాధితుల భూమిని వెంచర్ గా మార్చిన వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని పీడీ యాక్ట్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు ముదిగొండ ఎమ్మార్వో ని పొలిటికల్ పవర్ దినపత్రిక ప్రతినిధి సంప్రదించగా ఈ విషయాలు ఏవి తమ దృష్టికి రాలేదని చెప్పటం కోసం మెరుపు. 
