ప్రియుడి కోసం తన ఆరేళ్ల కుమార్తెను హత్య చేసిన తల్లి..!
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
బెంగళూరు – దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంకలకు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఒక కుమారుడు (15), కుమార్తె (6) సంతానం..!
కాడుగోడిలో ఉంటున్న సమయంలో ప్రియాంకకు తన బాల్య స్నేహితుడు మోహన్ కనిపించాడు.. దీంతో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది..!
రెండేళ్లుగా అతడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియాంక..!
ఈ విషయాన్ని గుర్తించి ప్రవీణ్ మందలించడంతో కుమారుడ్ని భర్త వద్ద విడిచిపెట్టి మోహన్‌తో కలిసి సహజీవనాన్ని మొదలుపెట్టిన ప్రియాంక..!
మూడు నెలల క్రితం కుమార్తె మరణించిందని ప్రవీణ్‌కు ఫోన్ చేసి చెప్పి.. ఆసుపత్రిలో ఇచ్చిన పోస్ట్ మార్టన్ రిపోర్ట్ ఇచ్చిన ప్రియాంక..!
ఆ నివేదికను విదేశాల్లో ఉంటున్న ఒక వైద్య స్నేహితునికి ప్రవీణ్ పంపించగా.. నివేదికలో పలు అంశాల్లో తప్పులు ఉన్నాయని, ఆహారం వికటించి పాప మరణించలేదని, హత్య చేసి తప్పుడు నివేదికను రూపొందించారని అతను చెప్పడంతో కాడుగోడి ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రవీణ్..!
ప్రియాంక తప్పించుకుని పరారీ కాగా, మోహన్‌ను అరెస్టు చేసిన పోలీసులు..!
నివేదిక ఇచ్చిన ఆసుపత్రిపైన కేసు నమోదు..!

