ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeతెలంగాణరాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

రాహుల్ గాంధీ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ, జూన్ 19 2026: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు చేపట్టి, రాహుల్ గాంధీ దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి రాహుల్ గాంధీ జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం మరింత బలోపేతం అవుతాయని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!