ePaper
Monday, September 14, 2026
📄 ePaper

ఈ నెల 14న జమ్మాపూర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రాక…

📰 Generate e-Paper Clip

ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 12 2026: పానగల్ మండలం జమ్మాపూర్ గ్రామంలో నిర్వహించనున్న భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా కమిటీ నాయకులు గురువారం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ను కలిసిన సంగతి తెలిసిన విషయం విగ్రహావిష్కరణకు జిల్లా కమిటీ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. జమ్మాపూర్ గ్రామంలో నిర్వహించనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరగా, కార్యక్రమానికి హాజరవుతానని మందకృష్ణ మాదిగ ప్రకటనలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను గ్రామీణ స్థాయిలో ప్రజలకు చేరవేయడం, సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవ సాధన కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగడం నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు సామాజిక మార్పుకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు మార్గదర్శకాలని, యువత ఆయన సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అనుబంధ సంఘాల సమన్వయకర్త గంధం గట్టయ్య, మొలకలపల్లి పరుశురాముడు మాదిగ, ఎంఎస్ఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు, జమ్మాపూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్రం రాములు, ఎర్రం చంద్రయ్య, ఎర్రం గోవిందు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డా. ఎర్రం నాగేంద్రం, మాజీ ఎంపీటీసీ సభ్యులు కురుమయ్య, వర్మ మాదిగ, ఎమ్మార్పీఎస్ వనపర్తి మండల అధ్యక్షులు మచ్చ తిరుపతి మాదిగ, గొర్ల ఆంజనేయులు, శ్రీను, ఇ రాములు మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జమ్మాపూర్ గ్రామంలో నిర్వహించనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల ప్రజలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Latest Articles

కోట్ల ఆస్తులు ఉన్నా... పక్కన మనిషి లేకపోతే ఆ జీవితం ఎంత...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్పొలిటికల్ పవర్...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

error: Content is protected !!