*కాలినడకన కోర్టుకు జడ్జి*
జూన్ 17: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంతలక్ష్మి బుధవారం కాలినడకన కోర్టుకు వెళ్లారు. ఇంధన పొదుపులో భాగంగా ఆమె అధికారిక వాహనంలో కాకుండా కాలినడకన కోర్టుకు వచ్చినట్లు ఆమె తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఇంధన కొరతను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. అలాగే శారీరక శ్రమ తగ్గిపోతున్న ఈ రోజుల్లో కాలినడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అధికారిక వాహనాన్ని పక్కన పెట్టి పర్యావరణ పరిరక్షణకు జడ్జి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

