ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeతెలంగాణసీఎస్ఆర్ (సీస్సార్ ) నిధులతో తెలంగాణ మోడల్ స్కూల్‌కి రంగులు వేసి కొత్తగా కట్టినట్లు మభ్యపెడుతున్న...

సీఎస్ఆర్ (సీస్సార్ ) నిధులతో తెలంగాణ మోడల్ స్కూల్‌కి రంగులు వేసి కొత్తగా కట్టినట్లు మభ్యపెడుతున్న రేవంత్.

📰 Generate e-Paper Clip

ఇదీ ఆరుట్ల పబ్లిక్ స్కూల్ భాగోతం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ న్యూరో బాజ శేఖర్ జూన్ 17 2026: గతంలో పాత షెడ్డుకు కొత్త రంగులు వేసి యంగ్ ఇండియా స్కూల్ అని పీఆర్ చేసి దొరికిపోయిన విషయం మీకు తెలుసు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో గతంలో ఎప్పటినుండో జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ప్రీప్రైమరీ పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉండగా దానిని తెలంగాణ మోడల్ అని మార్చిన తెలంగాణ ప్రభుత్వం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి విద్యా వ్యవస్థను మారుస్తానని ఈ తెలంగాణ మోడల్ స్కూల్‌ను తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని నామకరణం చేశారు. ఈ స్కూల్ ఆధునీకరణ కోసం సోషల్‌ డెమొక్రటిక్‌ ఫోరం సంస్థ రూ.2 కోట్ల సీస్సార్ నిధులు ఇవ్వగా, జీఎం అర్ సంస్థ సైతం సీస్సార్ నిధులు ఇచ్చింది. దీనికి రూ. 23 లక్షలు ప్రభుత్వ నిధులు జమ చేసి స్కూల్ బయట గోడలకు పెయింట్, ప్రహరీ గోడ, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, ప్రీ ప్రైమరీ పాఠశాలకు అవసరమైన ఆటవస్తువులు, ఫర్నీచర్‌.. ఫుట్‌బాల్‌, క్రికెట్‌ ఆడుకునేందుకు వీలుగా సుమారు అర ఎకరా స్థలంలో బాక్స్‌ నెట్‌ ఏర్పాటు చేశారు. పైన పటారం, లోన లోటారం అన్నట్టు కేవలం ముందువైపు రంగులు వేసి, వెనుక గోడలు వదిలేసారు. టాయ్‌లెట్లు కూడా మార్చలేదు. ఈ పాఠశాలలో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేసింది ఏమీ లేకపోగా పాత బిల్డింగులకు కేవలం బయటనుండి మాత్రమే పెయింట్ వేశారు. ఇదీ రేవంత్ మార్క్ అభివృద్ధి నమూనా అని చూసినవాళ్లు నవ్వుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!