ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపరెండు నెలల క్రితం గాయపడి చికిత్స పొందుతూ కడప ఆస్పత్రిలో మృతి

రెండు నెలల క్రితం గాయపడి చికిత్స పొందుతూ కడప ఆస్పత్రిలో మృతి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కడప జిల్లా ప్రతినిధి జూన్ 24 2026: కడప-కర్నూలు జాతీయ రహదారిపై ఏప్రిల్ 16వ తేదీన మైదుకూరు మండలం శ్రీనగర్ గ్రామం వద్ద కారును ఢీకొన్న వాహనం ముందువైపు ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దువ్వూరు మండలం చిన్న సింగనపల్లె గ్రామానికి చెందిన బొమ్ము జయ నరసింహారెడ్డి (40) అనే వ్యక్తి గాయపడ్డారు. అప్పటినుంచి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదం చేసిన వ్యక్తి కడప పట్టణం అక్కాయిపల్లెకు చెందిన కొట్టే ప్రశాంత్ గా గుర్తించారు. ప్రశాంత్ సాఫ్ట్వేర్ ఉగ్యోగి, ఏది ఏమైనా ఒక నుండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు 10వ తరగతి, రెండవ కుమారుడు ఐదో తరగతి చదువుతున్నారు. మృతదేహం పొద్దుటూరు జిల్లా హాస్పిటల్ నందు పోస్టుమార్టం తరలించారు. యువకుడు మరణించడంతో చిన్న సింగనపల్లి గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!