ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపామిరెడ్డి పల్లిలో ఎస్ఐఆర్ (ఎస్ఐఆర్) నమోదు ప్రక్రియ ప్రారంభం

పామిరెడ్డి పల్లిలో ఎస్ఐఆర్ (ఎస్ఐఆర్) నమోదు ప్రక్రియ ప్రారంభం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 25 2026: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) -2026 కార్యక్రమం పామిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం రోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల వివరాల నమోదు పారదర్శకంగా, కచ్చితత్వంతో జరుగుతుందని తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్క ఓటరు తమ వివరాలను స్థానిక బిఎల్ఓ లకు ఖచ్చితంగా అందించాలని సూచించారు. భవిష్యత్తులో ఓటరు జాబితాకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రజలందరూ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఇంద్రా లక్ష్మరెడ్డి మాజీ సర్పంచులు సిద్దయ్య తిక్కన్న వార్డు సభ్యులు కృష్ణ నరేష్ భాస్కర్ కొంకలి నరసింహ మండల ఆర్ఐ శంకర్, జీపీవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శి స్రవంతి గ్రామ బిఎల్ఓలు సునీత లక్ష్మి భాగ్యమ్మ శారద మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!