ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మద్దిగట్ల గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మద్దిగట్ల గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణ

📰 Generate e-Paper Clip

చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన మదిగట్ల సర్పంచ్ రాములు యాదవ్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 28 2026: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఐదేళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని ఆదివారం మద్దిగట్ల గ్రామ ఆరోగ్య కేంద్రం (సబ్ సెంటర్)లో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ… చిన్నారులను పోలియో వ్యాధి బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలోని ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా తల్లిదండ్రులు, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!