– 6.వ వార్డు కౌన్సిలర్ జే.అఖిల తండ్రి సుభాష్ ,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివిన్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29. 2026.
పోలియో రహిత భారతదేశం కోసం కొత్తకోట 6. వార్డ్ సిద్ధం కావాలని, కొత్తకోట మున్సిపాలిటీలోని 6.వ వార్డు కౌన్సిలర్ జే.అఖిల తండ్రి సుభాష్ అన్నారు.ఆదివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ లోని 6 వార్డ్ దండుగడ్డ స్కూల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో కౌన్సిలర్ జే.అఖిల తండ్రి సుభాష్ పాల్గొని
చిన్నారులకు రెండు చుక్కల పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ జే.అఖిల తండ్రి సుభాష్ మాట్లాడుతూ పోలియో రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి 5. సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రెండు చుక్కల పోలియోతో చిన్నారుల భవిష్యత్తు సురక్షితంగా కాపాడుకోవచ్చుని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు,పట్టణ అధ్యక్షుడు పెంటన్న యాదవ్ , హాస్పటల్ సిబ్బంది,అంగన్వాడి టీచర్ వనజ, ఆశ వర్కర్ పుష్ప, కాలనీవాసులు పాల్గొన్నారు.


