ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

*ఘనంగా చిల్డ్రన్స్ పార్లమెంట్ వార్షిక దినోత్సవం*

📰 Generate e-Paper Clip

 

*అశ్వారావుపేట పొలిటికల్ పవర్ న్యూస్ ( ఆర్సి కారం వెంకటేష్ )జులై 11:* ములకలపల్లి గుడ్ షెపర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చిల్డ్రన్స్ పార్లమెంట్ సభ్యుల వార్షిక సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పొగలపల్లి,తిమ్మంపేట, చోటిగూడెం కంపగూడెం ములకలపల్లి మాదారం జగన్నాధపురం మోగరాలగుప్ప మోటుగూడెం గొల్లగూడెం గ్రామాలకు చెందినటువంటి చిల్డ్రన్స్ పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.బాలసభ మంత్రులు మాట్లాడుతూ.క్షేత్రస్థాయిలో సమస్యలను తాము గుర్తించి వాటి పరిష్కారం కోసం గ్రామ సభలలో పాల్గొని వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి తమ మద్దతును అందించినటువంటి సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మూకమామిడి సర్పంచ్ కోర్సఆదిలక్ష్మి,ములకలపల్లి సర్పంచ్ కోర్స చంద్రలేఖ,పొగలపల్లి సర్పంచ్ మడకం రవి,మాదారం సర్పంచ్ సుజాత లు పాల్గొని మాట్లాడుతూ.చిన్నతనం నుంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం గ్రామాల్లోని నెలకొని ఉన్న సమస్యలను గుర్తించడం వాటి పరిష్కారాల కోసం ప్రయత్నించడం అభినందనీయమన్నారు.ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్యం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు.అదేవిధంగా పాఠశాలలో నిర్వహించేటువంటి పేరెంట్ మీటింగ్ టీచర్ తల్లిదండ్రులను కూడా తీసుకొని వచ్చేలా చూడాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ,తిమ్మంపేట హెచ్ఎం శంకర్,సిస్టర్స్ ఉదయ రీమా తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా……

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా……

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 13 2026: శనివారం రోజు అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు...

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 12 2026: పెద్దమందడి 18 సంవత్సరా లు...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*దేశంలోని శాటిలైట్‌ టీవీ ఛానళ్లలో టీవీ9 అగ్రస్థానంలో వుంది....
error: Content is protected !!