– మనమందరం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం ఎవరు మనస్పర్ధలకు అవకాశం ఇవ్వకండి ఎలాంటి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించకండి,
– నేను మీలా ఒక సాధారణ, సామాన్య కార్యకర్తనే
దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక /పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 22.2026. ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యుల కూర్చుని మాట్లాడుకుందాం గ్రామాల్లో సమస్యలు ఏమైనా ఉంటే మండల స్థాయి నాయకులు,మండల పార్టీ అధ్యక్షులతో చర్చించి పరిష్కరించుకోవాలని కొందరు అవకాశవాద రాజకీయ నాయకులు గుంటనక్కల్లా కాచుకొని కూర్చున్నారు.అసమ్మతి నాయకులను కార్యకర్తలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని నమ్మకండి. ఎవరు అధైర్యపడకండి 2034 వరకు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. దేవరకద్ర గడ్డపై మరోసారి మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం… భగవంతుని దయతో ఇంకా ఉన్నత హోదాతో మీకు సేవ చేసుకునే అవకాశం కచ్చితంగా వస్తుంది
అహర్నిశలు మీకోసం పనిచేసే మీ GMR నే..
నాకు వేరే వ్యాపకాలు వేరే వ్యాపారాలు లేవు ప్రజాసేవయే నా అంతిమ లక్ష్యం నన్ను శాసనసభ్యులుగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మంచి చేయడమే నా జీవిత ఆశయం నేను నియోజకవర్గంలో ఉంటే మీ మధ్యలో ఉంటా హైదరాబాదులో ఉంటే నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం సెక్రటేరియట్ లో మంత్రులను,ఉన్నతాధికారులను కలిసి అభివృద్ది పనులపై చర్చించి నిధులు సమకూర్చే పనిలో ఉంటా… నేను రాజకీయాల్లోకి వచ్చింది నిస్వార్ధంగా ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో వచ్చా…న్యాయవాద వృత్తిలో డబ్బు సంపాదించుకునే అవకాశం ప్రజాసేవయే పరమావధిగా భావించి న్యాయవాద వృత్తిని వదిలి మీ కోసం మీ ముందుకు వచ్చా…
