ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివ్యవసాయ రంగంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించాలి

వ్యవసాయ రంగంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించాలి

📰 Generate e-Paper Clip

– అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ  న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 25.2026.
వ్యవసాయ రంగంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సూచించారు.శుక్రవారం పానగల్ మండలంలోని రాయిన్‌పల్లి, బుసిరెడ్డిపల్లి గ్రామాలనుఆయనసందర్శించారు.ఈసందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసిరైతులతోఅవగాహనసమావేశంనిర్వహించారు.ఈసమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగాపంటలఎంపికచేసుకోవడంతోపాటు,నీటివినియోగాన్నిసమర్థవంతంగా నిర్వహిస్తూ వాతావరణ సహితవ్యవసాయ పద్ధతులనుపాటించాలనిరైతులకుసూచించారు.భూమిఆరోగ్యంపట్లరైతులుప్రత్యేకశ్రద్ధవహించాలని, మట్టి నమూనాలను క్రమం తప్పకుండా పరీక్షించి, భూసార పరీక్షల నివేదికల ఆధారంగా ఎరువుల వినియోగం చేపట్టాలనిసూచించారు.భూసారాన్నికాపాడడంద్వారాదిగుబడులుపెరగడంతోపాటువ్యవసాయం స్థిరమైన అభివృద్ధి దిశగా సాగుతుందనితెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, పి.డి. డీఆర్డిఒ ఉమాదేవి, తహసిల్దార్, ఎంపీడీఓ,  క్షేత్ర స్థాయి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!