ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమత దురహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం పోరాడుతాం

మత దురహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం పోరాడుతాం

📰 Generate e-Paper Clip

ప్రజా సమస్యలను గుర్తించి ప్రజా పోరాటాలను నిర్మించాలి.. మహనీయుల వారసత్వాన్ని ముందుకు నడపాలి

అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల నిర్మాణ ప్రక్రియను చేపట్టాలి

నూతన తరాన్ని ఉద్యమంలోకి తీసుకొచ్చి శక్తివంతమైన సైన్యంగా తయారుచేసేందుకు ఎం ఆర్ పి ఎస్ శ్రేణులు శ్రమించాలి

ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి వనపర్తి జిల్లా ఇంచార్జీ

-కొమ్మవారి మస్తాన్ మాదిగ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 28 2026: మూడు దశాబ్దాలుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాజీలేని పోరాటం చేసి ఎస్సి వర్గీకరణను సాధించడమే కాకుండా మాదిగలతో పాటు పేద వర్గాల సంక్షేమం కోసం ఉద్యమాలు నడిపి పలు అనేక సంక్షేమ పథకాలు సాధించిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం నేడు మత దురహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం పోరాడుతుందని, ప్రజా సమస్యలను గుర్తించి బలమైన ప్రజా పోరాటాలను నిర్మిస్తూ మహనీయుల స్ఫూర్తితో స్వతంత్ర శక్తిగా పీడిత వర్గాల భవిష్యత్తు కోసం ఉద్యమిస్తుందని ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి వనపర్తి కొమ్మవారు మస్తాన్ మాదిగ అన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వనపర్తి లోని ప్రవేట్ ఫంక్షన్ హాల్ ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి మరియు అనుబంధ విభాగాల వనపర్తి జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న కొమ్మవారి మస్తాన్ మాదిగ మాట్లాడుతూ… ఈదేశంలో దుర్మార్గమైన కుల వ్యవస్థ ఉండడం వలనే మనం అత్యంత పేదలుగా మిగిలిపోయామని, వేల సంవత్సరాల నుంచి అణిచివేతకు గురిచేసిన కుల వ్యవస్థను కూకటివేలతో కూల్చివేయాలని అన్నారు. దోపిడి వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం ముందుకు సాగాలని అందుకోసం గౌతమ బుద్ధుడు నుండి సంత్ రవిదాసుల ఆశయాల సిద్ధికై వారి అడుగుజాడల్లో తమ జీవితాలను వెచ్చించిన పూలే, అంబేద్కర్, జగజీవన్ రామ్, కాన్షిరామ్ ల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ శ్రేణులు శ్రమించాలని అన్నారు. మాదిగలే కాకుండా పేదరికంలో ఉన్న అణగారిన వర్గాల ఆర్థిక ఎదుగుదలకు మనమే ఉద్యమించాలని, రాజకీయ చైతన్యాన్ని, సృహను విడువకుండా కలిసొచ్చే సామాజిక శక్తులను కలుపుకొని పీడిత వర్గాల విముక్తి కోసం సరికొత్త పందాలో ఉద్యమ నిర్మాణాన్ని కొనసాగించాలని, అందుకు గ్రామ స్థాయిలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బలమైన ప్రజా పోరాటాలను నిర్మించాలని కోరారు. ఎం ఆర్ పి ఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల కమిటీలు రద్దు ఐనా సందర్బంగా నూతన గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని జాతి కోసం, సమాజం కోసం కష్టపడే వారిని, విద్యావంతులను కమిటీలోకి తీసుకోవాలని, ఎమ్మార్పీఎస్ తో పాటు అన్ని అనుబంధ విభాగాలను సంస్థగతంగా పునరనిర్మాణం చేసుకొని శక్తివంతంగా తయారు చేయాలని అన్నారు. నూతన విద్యార్థి, యువ తరాన్ని ఉద్యమంలోకి తీసుకోచ్చి క్షేత్రస్థాయిలో శ్రమించాలని పిలుపునిచ్చారు. మన పని విధానమే మనల్ని నిలబెడుతుంది కాబట్టి మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ విజయవంతం కోసం ఒక బలమైన ఆశయంతో నాయకులందరు పనిచేయాలని, నూతన కమిటీలు, అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకొని పీడిత వర్గాల విముక్తి సైన్యంగా తయారు కావాలని అందుకోసం మన శ్రేణులు గ్రామాలకు తరలి జాతిని, సమాజాన్ని సంస్కరించే విధంగా నిబద్ధతతో శ్రమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు గంధం గట్టయ్య మాదిగ మీసాల నాగరాజు మాదిగ, ఆజ్జపాగ లక్ష్మణ్ మాదిగ, మాజీ ఎంపీటీసీ మాలపల్లి మన్యం మాదిగ, మచ్చ తిరుపతి మాదిగ, వెంకట్ రాములు మాదిగ, దేవని రమేష్ మాదిగ, గౌరీపాగ లక్ష్మణ్ మాదిగ, డి ఆర్ కృష్ణ మాదిగ, మంద కుమార్ మాదిగ అజయ్ మాదిగ, రాజు మాదిగ, ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా నాయకులు వర్మ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!