అతి తక్కువ సమయంలో ప్రక్రియ విజయవంతం
-సర్పంచ్ రాజమహేందర్ రెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 28 2026: వనపర్తి జిల్లా అల్వల గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. గ్రామ ప్రజలు, బూత్ లెవల్ అధికారుల సమిష్టి సహకారంతో అతి తక్కువ సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు సర్పంచ్ రాజామహేందర్ రెడ్డి తెలిపారు. గ్రామంలో గతంలో 1,046 మంది ఓటర్లు ఉండగా, తాజా ఎన్యూమరేషన్ అనంతరం 1,001 మంది ఓటర్లు ఆన్లైన్లో నమోదు అయినట్లు వెల్లడించారు. వివిధ కారణాల వల్ల 45 ఓట్లు తొలగించబడినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో బూత్ లెవల్ అధికారులు, బీఎల్ఏ-2 ప్రతినిధులు కీలక పాత్ర పోషించారని సర్పంచ్ అన్నారు. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడంతో ప్రక్రియ వేగంగా పూర్తయిందని ఆయన అభినందించారు. ఓటరు జాబితాను పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించారని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియల్లో ప్రజల భాగస్వామ్యం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని సర్పంచ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని రాజామహేందర్ రెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ సమయంలో ప్రక్రియ విజయవంతం