ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివచ్చే పదో తరగతి పరీక్షల్లో గణితం ఇంగ్లీష్ ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్...

వచ్చే పదో తరగతి పరీక్షల్లో గణితం ఇంగ్లీష్ ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలి 

📰 Generate e-Paper Clip

– ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు కల్పించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 29.2026.
జిల్లాలో వచ్చే పదో తరగతి పరీక్షల్లో గణితం, ఇంగ్లీష్,ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇంగ్లీష్, ఫిజిక్స్ స్టడీ మెటీరియల్ తయారీ అంశంపై సంబంధిత ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ఇంగ్లీష్, ఫిజిక్స్ ప్రత్యేక పాఠ్య పుస్తకాల తయారీ పురోగతిపై కలెక్టర్ ఆరా తీయగా, ఉపాధ్యాయులు స్పందిస్తూ తయారీ పూర్తయిందని ప్రింటింగ్ చేయాల్సిఉందనితెలిపారు.ఈసమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ తయారు చేసి బోధించిన మాదిరిగానే, ఈ ఏడాది గణితంతోపాటు ఇంగ్లీష్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అమలు చేయాలనిసూచించారు. ఇంగ్లీష్, ఫిజిక్స్ ప్రత్యేక పుస్తకాలను రాబోయే వారం రోజుల్లో సిద్ధం చేసుకోవాలన్నారు.
ఆగస్టు 12వ తేదీలోగా జిల్లాలోని అన్ని ప్రభుత్వపాఠశాలల్లోసంబంధితసబ్జెక్టులఉపాధ్యాయులకు నూతనంగా రూపొందించిన ఇంగ్లీష్, ఫిజిక్స్ పాఠ్యపుస్తకాల పంపిణీని పూర్తిచేయాలనిఅధికారులనుఆదేశించారు.అదేవిధంగా, ఆగస్టు 4, 5, 6 తేదీల్లో పదో తరగతి విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆ పరీక్షల ఆధారంగా సబ్జెక్టుల్లో వెనుకబడిన (స్లో లెర్నర్స్) విద్యార్థులను గుర్తించాలని తెలిపారు.గుర్తించిన విద్యార్థులకు కొత్త స్టడీ మెటీరియల్‌తో మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఆయా సబ్జెక్టులపై పూర్తి అవగాహనకల్పించాలనిసూచించారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, వచ్చే ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో ఎవరూ ఫెయిల్ కాకుండా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
– ఎంఈవోలు విద్యార్థుల విద్యా ప్రమాణాలను పర్యవేక్షించాలి,
 జిల్లాలోనిప్రతిప్రభుత్వపాఠశాలలోవిద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుఅన్నిమౌలిక వసతులుఅందుబాటులోఉండేలాఅధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపై మండల విద్యాధికారుల(ఎంఈఓలు)తో వేరుగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో  మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థుల అడ్మిషన్ వివరాలను వెంటనే యూడైస్ పోర్టల్ ఆన్‌లైన్‌లో నవీకరించాలని ఆదేశించారు. డ్రాప్‌అవుట్ విద్యార్థులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రతి విద్యార్థిని తిరిగి పాఠశాలలో చేర్పించేలాకృషిచేయాలనిసూచించారు.విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు, ఎంఈఓలు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, మరుగుదొడ్లు లేని పాఠశాల ఒక్కటి కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. మండల విద్యాధికారులు తమ పరిధిలోని పాఠశాలలను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు. పాఠశాలల సందర్శన సమయంలో విద్యార్థుల విద్యా పురోగతి, అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించి అవసరమైన సూచనలు అందించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జెడ్పి సీఈవో యాదయ్య, ఎంఈఓ లు, ఈ డబ్ల్యూ ఐ డి సి ఇంజనీరింగ్ అధికారులు, ఇతర విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!