ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆషాడ గురు పౌర్ణమి సందర్భంగా అంబా సత్రంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి కుంకుమార్చన...

ఆషాడ గురు పౌర్ణమి సందర్భంగా అంబా సత్రంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి కుంకుమార్చన ఘనంగా

📰 Generate e-Paper Clip

ఎన్విఆర్ న్యూస్ తెలుగు పొలిటికల్ పవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్. భద్రాచలం] [29.07.2026]: ఆషాడ మాసం గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబా సత్రంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమం భక్తి శోభతో అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ, పుణ్యాహవచనంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణతో 1008 సార్లు అమ్మవారికి కుంకుమార్చన చేశారు. గురు పౌర్ణమి ప్రత్యేకతను వివరిస్తూ ఆలయ పూజారులు భక్తులకు ప్రవచనం చేశారు. బాల రూపంలో ఉన్న త్రిపుర సుందరి దేవిని కుంకుమతో అర్చించడం వల్ల కుటుంబంలో సుఖ శాంతులు, స్త్రీలకు సౌభాగ్యం, విద్యార్థులకు చదువులో పురోగతి కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సుమంగళులకు, కన్యలకు పసుపు-కుంకుమ, చీరలు, గాజులు పంపిణీ చేశారు. చివర్లో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ కాశి విశ్వనాధేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో [ ఆలస్యం విరన్ చైర్మన్] మరియు ట్రస్ట్ సభ్యులు విజయవంతంగా నిర్వహించారు. మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని కవర్ చేశారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని నిర్వాహకులు కోరుకున్నారు. ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ బాలాయై నమః

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!