ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రతిశుక్రవారంఫ్రైడేడ్రైకార్యక్రమాన్నిసమర్థవంతంగా నిర్వహించాలి

ప్రతిశుక్రవారంఫ్రైడేడ్రైకార్యక్రమాన్నిసమర్థవంతంగా నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

 – ప్రజల సహకారంతో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులను నివారించాలి,
– అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01.2026.
జిల్లాలో ప్రతి వారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని  సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజల సహకారంతో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులను నివారించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్ పేర్కొన్నారు.
శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ పెబ్బేర్ మున్సిపాలిటీలోని 7వ వార్డుతో పాటు పెబ్బేర్ మండలంలోనిబునియాదిపూర్ గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్య కార్యక్రమాలనుక్షేత్రస్థాయిలోపరిశీలించారు.ఈ సందర్భంగా వీధులు, డ్రైనేజీలు, నివాస ప్రాంతాలను పరిశీలిస్తూ వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన ఆరోగ్య, పారిశుద్ధ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో పాత్రలు, కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఇతర వ్యర్థ వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు. దోమలవ్యాప్తినిఅరికట్టేందుకు బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నివారణ మందులను పిచికారీ చేయడం, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, పిచ్చి మొక్కలనుతొలగించడం,ఎక్కడామురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్తను నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వేయడం, పరిశుభ్రతను దైనందిన జీవన విధానంలో భాగంగా చేసుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. గ్రామాలు, పట్టణాలను వ్యాధి రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.అనంతరంబునియాదిపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించి అక్కడి నిర్వహణ, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పెబ్బేర్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ), ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి, వార్డు కౌన్సిలర్లు, వైద్య శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!