ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిదోమల వ్యాప్తికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించాలని

దోమల వ్యాప్తికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించాలని

📰 Generate e-Paper Clip

 – డ్రైనేజీలు, కాలువలు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి,

 – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 31. 2026.

పురపాలికల్లో దోమల వ్యాప్తికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించాలని, డ్రైనేజీలు, కాలువలు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ వనపర్తి పట్టణంలోని తెలుగువాడ ప్రాంతంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. వైద్య శాఖ సిబ్బంది ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్న తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా కాలనీలో చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలు, పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించిన కలెక్టర్ ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి శుక్రవారం నిర్వహించే ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.దోమల వ్యాప్తికి కారణమయ్యే నీటి నిల్వలను పూర్తిగా తొలగించాలని, డ్రైనేజీలు, కాలువలు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సూచించారు. కాలనీలు, వీధుల్లో చెత్త పేరుకుపోకుండా సకాలంలో తొలగించి పారిశుద్ధ్య ప్రమాణాలను పాటించాలని అధికారులకు ఆదేశించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ మాధవి, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, ఆరోగ్యశాఖ సిబ్బంది,, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!