ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిచిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 02 2026: పెబ్బేరు పట్టణానికి చెందిన వల్లపు రేఖ, శ్రీసత్యనారాయణ రెడ్డి దంపతుల మనవడు, యు.ఎస్. నిత్య రెడ్డి – శ్రీ జగదీశ్వర్ రెడ్డి దంపతుల కుమారుడు నైతిక రెడ్డి డోలారోహణ (ఉయ్యాల) కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పిల్లల జీవితంలో డోలారోహణ వంటి శుభకార్యాలు చిరస్మరణీయమైనవని అన్నారు. ఇలాంటి వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం చిన్నారిపై కుటుంబ సభ్యులకు ఉన్న ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక అని పేర్కొన్నారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, కృష్ణ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, రాముల యాదవ్, భాను ప్రకాష్ రెడ్డి, యుగేందర్ రెడ్డి, నాగరాజు, మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!