ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఎమ్మెల్యేకు వినతిపత్రం అందించిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు

📰 Generate e-Paper Clip

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హామీ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 02 2026: వనపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఆదివారం రాష్ట్ర జరనల్ సెక్రెటరీ సత్యన్న ఆధ్వర్యంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డిని కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ… వనపర్తి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసుకున్న కుర్చీలను తొలగించారని, వాటిని తిరిగి అదే ప్రదేశంలో ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. అలాగే విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో, ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. బస్టాండ్ ఆవరణలో సిమెంట్ కుర్చీలను తిరిగి ఏర్పాటు చేసే విషయంలో అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తానని విశ్రాంత ఉద్యోగులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కె. వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు, కోశాధికారి, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పలువురు విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!