ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బయటపడ్డ మరో కుంభకోణం

తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బయటపడ్డ మరో కుంభకోణం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్  ఆగస్టు 05 2026: కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఇష్టారాజ్యంగా కేటాయింపులు పనులను ముక్కలుగా విభజించి కాంట్రాక్టులు కట్టబెడుతున్న వైనం రూ.469 కోట్లు అదనంగా పెరిగిన ఆపరేషన్ & మెయింటెనెన్స్ వ్యయం తెలంగాణలోని పలు థర్మల్ పవర్ ప్లాంట్లలో తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు, పనులను పెద్ద సంఖ్యలో విభజించి కాంట్రాక్టులు కట్టబెడుతున్న చీఫ్ ఇంజినీర్లు అవసరం లేకున్నా కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించి, వారికి ఎలాంటి పనులు లేకున్నా జీతాలు ఇస్తున్న వైనం ఇటీవల జరిగిన తనిఖీల్లో కేవలం బయ్యారంలోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోనే 400కు పైగా కాంట్రాక్టు పనులు చేయిస్తున్నట్టు గుర్తించిన ఉన్నతాధికారులు తెలంగాణలోనే అనేక విద్యుత్ కేంద్రాల్లో ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నట్టు ఉన్నతాధికారుల గుర్తింపు సాధారణంగా అన్ని జెన్‌కో కేంద్రాలకు O&M పనులకు ఒక్క ఆర్థిక సంవత్సరానికి రూ.2,068.70 కోట్లు సరిపోతాయని, అందుకు ఆమోదం తెలిపిన ఈఆర్‌సీ అయితే మరో రూ.890.44 కోట్లు పెంచాలని ఈఆర్‌సీని కోరిన జెన్‌కో దీనిపై విచారణ జరిపి రూ.469 కోట్లకు O&M ఖర్చులు పెంచుతూ ఆమోదం తెలిపిన ఈఆర్‌సీ దీంతో రూ.2,068.70 కోట్ల నుండి రూ.2,537.77 కోట్లకు పెరిగిన O&M వ్యయం పెరిగిన వ్యయంతో జెన్‌కోకు ఒక్క యూనిట్‌పై 0.46 పైసలు అదనంగా చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన డిస్కం సంస్థలు పెరిగిన భారమంతా ప్రజల నుండి కరెంట్ బిల్లుల రూపంలోనే వసూలు చేస్తారని, ప్రజలపై అనవసర భారం మోపడం సరికాదని నిపుణుల సూచన

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!