ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు ఆదర్శనీయం - పలుస శంకర్ గౌడ్

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు ఆదర్శనీయం – పలుస శంకర్ గౌడ్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 06 2026: తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని గురువారం రేడియంట్ హైస్కూల్, తిరుమల హిల్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాహితీ కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రిన్సిపల్ ఉప్పరి తిరుమలేష్ మాట్లాడుతూ మహనీయుల జీవితాలను అధ్యయనం చేసి సమాజ సేవకు అంకితమవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపల్ బి. రాము మాట్లాడుతూ తెలంగాణ సాధనలో జయశంకర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, జయశంకర్ సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాహుల్, శాంతియ్య .రవి, శ్రీనివాస్, అఖిల్, మల్లేష్, ఖదిరున్నిసా, రామేశ్వరి, గీతా, రజిత, శ్వేత, సరోజ, సాత్విక, జరీనా తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!