ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంమోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల పై కదం తొక్కిన ఎర్ర దండు

మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల పై కదం తొక్కిన ఎర్ర దండు

📰 Generate e-Paper Clip

ములకలపల్లి లో కార్మికులు,రైతులు,వ్యవసాయ కార్మికులు భారీ రాస్తారో

బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటాలు ఉధృతం చేయాలి

కార్మిక హక్కులను హరిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు కార్మిక, కర్షక ఐక్య ఉద్యమాలు చేయాలి

పొలిటికల్ పవర్ న్యూస్ ఎన్ వి ఆర్ 9 టీవీ తెలుగు సమగ్ర జాతీయ పత్రిక( ఆర్సి కారం వెంకటేష్) ములకలపల్లి: బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాల పై ఐక్య ఉద్యమాలు ఉధృతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచిలి వంశీకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పోతుగంటి లక్ష్మణ్,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహా కార్యదర్శి ముదిగొండ రాంబాబు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ కే యం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాపితంగా జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ములకలపల్లి ప్రధాన కూడలిలో ప్రధాన రహదారిపై భారీ రాస్తారో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… దేశంలోని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను కార్పొరేట్ బడా పారిశ్రామిక పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తుందని అన్నారు. ఎరువుల బుకింగ్ యాప్ ను తీసుకువచ్చి దేశ రైతాంగాన్ని ఇబ్బందులు,కష్టాల్లోకి నెడుతుందని విమర్శించారు. ఎరువుల బుకింగ్ యాప్ ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు కారణంగా రైతులు పంటలు నష్టపోతున్నారు. విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసర్వించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ రైతాంగ సమస్యలను పరిష్కారించడంలో బిజెపి ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆమోరికతో వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ దేశ ప్రజా సమస్యలు కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను గుత్తా పెట్టుబడిదారులకు అప్పజెప్పి దేశ ప్రజలకు అన్యాయం చేస్తుందని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికుల పోట్టను కొట్టే ప్రయత్నం చేస్తున్నా బిజెపి ప్రభుత్వ కుట్రను తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి బీజీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికులకు 200 రోజులు పని దినాలు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాల పరిరక్షణ కోసం కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు పెంచాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్మిక హక్కులు హరిస్తే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా కార్యదర్శి కోర్సా రామక్రిష్ణ,అఖిల భారత రైతు సంఘం డివిజన్ కార్యదర్శి నకిరేకంటి నాగేశ్వరరావు, టిఏజిఎస్ జిల్లా అధ్యక్షుడు గౌరీ నాగేశ్వరరావు, రైతు సంఘ మండల కార్యదర్శి యర్లగొర్ల రామారావు, ఏఐకెఎస్ మండల కార్యదర్శి వూకంటి రవికుమార్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మాలోతు రావూజ, సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు, గోపగాని లక్ష్మీనరసయ్య,బుగ్గా వెంకట నర్సమ్మ,గడ్డం వెంకటేశ్వర్లు, కుంజా రాంమూర్తి, కీసరి వెంకట్రావ్, సామిని, వినోద్, సైదమ్మ, కోర్స వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!