ఘనంగా శ్రీ విశ్వకర్మ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం…
ముఖ్య అతిథిగా తుంగ తుర్తి రవి హాజరు….
మేడిపల్లి : ఆగష్టు 12/ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ హైదరాబాద్ సిటీ బ్యూరో కె ఉపేందర్
శ్రీ విశ్వకర్మ సంఘం మేడి పల్లి నూతన కమిటీ ప్రమా ణ స్వీకార మహోత్సవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణం లో ఘనంగా జరిగింది. సంఘ అధ్యక్షులు కందోజు వెంక టాచారి, ప్రధాన కార్య దర్శి కూరెళ్ల లక్ష్మీనారాయ ణచారి సంయుక్త ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ కార్యక్ర మానికి మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు తుంగ తుర్తి రవిచారి ముఖ్య అతి థిగా విచ్చేశారు.ఈ కార్యక్ర మంలో నూతన కార్యవర్గం గా అధ్యక్షులుగా బెజ్జంకి శ్రీనివాసచారి, ప్రధాన కార్య దర్శిగా శ్రీరామోజు వేణుచా రి, కోశాధికారిగా మొలు పోజు రాజుచారితో పాటు ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి హాజరై మాట్లాడుతూ.. సమాజంలో విశ్వకర్మల సేవలు ఎంతో గొప్పవని, అందరూ ఐక్యత తో ఉంటూ సంఘ అభివృద్ధి కి పాటుపడాలని పిలుపు నిచ్చారు.గడిచిన 21 సంవ త్సరాలుగా ఎలాంటి విభేదా లు లేకుండా సంఘాన్ని ఏక తాటిపై నడిపిస్తూ,అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేసిన మాజీ అధ్యక్షులు కందోజు వెంకటాచారి, ప్రధాన కార్య దర్శి కూరెళ్ల లక్ష్మీనారాయ ణచారిల సేవలను ఆయన ప్రత్యేకంగాఅభినందించారు. నూతనంగా ఎన్నికైన కమి టీ కూడా అదే స్ఫూర్తితో సంఘాన్ని మరింత ముందు కు తీసుకెళ్లాలని ఆకాంక్షిం చారు.ఈ కార్యక్రమంలో సిరిపురం సర్వేశ్వర్‌చారి, జంగాచారి, రమేష్‌చారి, పబ్బోజు శ్రీనివాస్‌చారి, సోమాచారి, సుత్తోజు కుమారస్వామి, బాలాచారి, శంకరాచారి, రాములుచారి, బాలరాజు చారి, శ్రీనివాస చారి, రామాచారితో పాటు భారీ సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

