పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కీసర సర్కిల్ :యాదగర్ పల్లి : మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు ఈరోజు కీసర డివిజన్లోని యాద్గారి పళ్లి గ్రామంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ విద్యార్థినీ విద్యార్థుల మరియు అధ్యాపక బృందం ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాని వివిధ పార్టీల రాజకీయ నాయకులు, యాద్గారి పళ్లి మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మరియు గ్రామ యువకులు అందరూ కలిసి గ్రామంలోని వీధి వీధిన తిరుగుతూ, స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ దేశ భక్తి గీతాల ఆలాపనతో గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం పట్ల, జాతీయ జెండా పట్ల చిన్న వయసు నుండే దేశభక్తినీ పెంపొందించు కోవాలని, రేపటి తరాలకు మీరే భవిష్యత్తు అవుతారని పేర్కొనడం జరిగింది. మాజీ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తిరంగా ర్యాలీ నిర్వహించడం నిజంగా గొప్ప విశేషమని ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా ర్యాలీలో పాల్గొన్నవిద్యార్థినీ విద్యార్థులకు బిస్కట్ ప్యాకెట్లు ఇవ్వడo జరిగింది.
