ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్*బి.జె.పి.తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రంగుల శంకర్*

*బి.జె.పి.తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రంగుల శంకర్*

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కీసర సర్కిల్ : జవహర్ నగర్ : భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా రెండవ సారి నియమించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చ అధికార ప్రతినిధి రంగుల శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ తో పాటు రంగుల శంకర్ నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్.రామచంద్ర రావు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఓబీసీ వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నిబద్ధతతో, అంకితభావంతో పనిచేస్తానని సగర్వంగా తెలియజేస్తున్నానని రంగుల శంకర్   స్పష్టం చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!