జాతీయ స్థాయి చిత్రకళా పోటీ పోస్టర్ ను ఆవిష్కరించిన డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్.
శ్రీ ఎగ్గడి భాస్కర్, ఐ.పి.యస్
ఆగస్టు 13 : పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా కేంద్రంగా చిత్రకళా రంగానికి చెందిన సంస్థ చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ అండ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన “మేరా భారత్ మహాన్” అనే అంశం మీద నిర్వహించే బోయే జాతీయ స్థాయి చిత్రకళా పోటీ పోస్టర్ ను మంచిర్యాల జిల్లా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎగ్గడి భాస్కర్ ఐ.పి.యస్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అకాడమీ డైరెక్టర్ చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ చిత్రకళా పై పిల్లలకు అవగాహన కల్పించడంతో పాటు వారికి చిత్రకళా పై మక్కువ పెంచే దిశగా తమ అకాడమీ ఆధ్వర్యంలో వివేకవర్ధిని డిగ్రీ కాలేజీ, మంచిర్యాల లో ఈ పోటీ నిర్వహిస్తున్న అని, అలాగే పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సాహించాలని, మా అకాడమీ నుండి ఇది మూడవ జాతీయ స్థాయి చిత్రకళా పోటీ అని అన్నారు… ఈ పోటీలో నర్సరీ నుండి డిగ్రీ పైన వాళ్లు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ పోటీలో ఐదు కేటగిరీ లు ఉంటాయి. ప్రతి కేటగిరీ కి రెండు స్పెషల్ ప్రైజెస్ ఉంటాయి… పాల్గొన్నా ప్రతి ఒక్కరికీ మెడల్, జాతీయ స్థాయి ప్రశంసాపత్రం ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనడానికి ఈ నెంబర్ కు 9908149591 పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు…

