ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరాణి రుద్రమదేవి వేషధారణలో యూకేజీ చిన్నారి మేఘన

రాణి రుద్రమదేవి వేషధారణలో యూకేజీ చిన్నారి మేఘన

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15, 2026: కొత్తకోట 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కొత్తకోటలోని శ్రీ వెంకట పద్మ రాయల్ హైస్కూల్‌లో విద్యార్థులు, చిన్నారులు దేశభక్తిని చాటేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనిమెట్ట గ్రామానికి చెందిన వాకిటి పరుశరామ్ కుమార్తె వాకిటి మేఘన అనే యూకేజీ చిన్నారి రాణి రుద్రమదేవి వేషధారణలో అందరినీ ఆకట్టుకుంది. చిన్నారి మేఘన రాణి రుద్రమదేవి పాత్రలో చక్కటి ప్రదర్శన ఇవ్వడంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆమెను అభినందించారు. చిన్నారుల్లో దేశభక్తి, చారిత్రక అవగాహన, సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కావలి రఘు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కావలి రఘు మాట్లాడుతూ… స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం వారు చేసిన త్యాగాలను ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని సూచించారు. సమరయోధుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకు సాగడమే స్వాతంత్ర్య సమరయోధులకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధులు, చారిత్రక ప్రముఖుల వేషధారణలో పాల్గొనడం ద్వారా వారి ప్రతిభకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!