ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిస్వాతంత్ర్య సమరయోధుల జీవిత లను విద్యార్థులు స్ఫూర్తి గా తీసుకోవాలి

స్వాతంత్ర్య సమరయోధుల జీవిత లను విద్యార్థులు స్ఫూర్తి గా తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

-పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: భారత 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రేడియంట్ ఉన్నత పాఠశాల లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్‌గౌడ్‌ జిల్లా అధ్యక్షులు గారు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…  ఉపాధ్యాయులకు,విద్యార్థులకు దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఏళ్ల బానిస సంకెళ్లను తెంచేందుకు స్వాతంత్ర్య సమరయోధులు చూపిన పోరాట పటిమ, ధైర్యసాహసాలు, దేశభక్తి మనందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుల త్యాగాల ఫలితమే మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ. వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ భవిష్యత్తు కోసం యువత బాధ్యతగా ముందుకు సాగాలి అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు విద్యార్థి దశ నుండి దేశభక్తి కలిగిఉండాలన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల పంపిణీ చెసారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకునాయి. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్కూల్ డైరెక్టర్ కౌసల్య భాస్కర్, ప్రిన్సిపాల్ ఉప్పరి తిరుమలేష్, వైస్ ప్రిన్సిపాల్ బి.రాము, ఉపాధ్యాయులు రాహుల్, శాంతియ్య .రవి, శ్రీనివాస్, అఖిల్, మల్లేష్, ఖదిరున్నిసా, రామేశ్వరి, గీతా, రజిత, శ్వేత, సరోజ, సాత్విక, జరీనా తల్లిదండ్రులు తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!