ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తికడుకుంట్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

కడుకుంట్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: నపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2025-26 విద్యా సంవత్సరంలో పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కడుకుంట్ల గ్రామానికి చెందిన ముసలి బాలరాజు, తన తల్లిదండ్రులు ముసలి కొండన్న, ముసలి శంకరమ్మల జ్ఞాపకార్థం విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందించారు. పరీక్షల్లో టాప్‌గా నిలిచిన మొదటి ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున, మిగిలిన 21 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,500 చొప్పున మొత్తం రూ.41,500/- నగదును పంపిణీ చేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి మద్దిలేటి తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్ తిరుపతయ్య, ఉపసర్పంచ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఇందిరమ్మ, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!