పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: వనపర్తి వ్యవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. వారి చేతుల మీదుగా ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డును అందజేశారు. వ్యవసాయ శాఖలో విధి నిర్వహణలో కురుమయ్య అందించిన సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయ శాఖ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఆయన సేవలు అందించారు. ఉత్తమ సేవలకు జిల్లా స్థాయి గుర్తింపు లభించడం పట్ల కురుమయ్య సంతోషం వ్యక్తం చేశారు. అవార్డు అందుకున్న కురుమయ్యను అధికారులు, సహచర ఉద్యోగులు, స్నేహితులు, పలువురు అభినందించారు. తనకు లభించిన ఈ అవార్డు మరింత బాధ్యతతో విధులు నిర్వహించేందుకు ప్రోత్సాహం ఇస్తుందని కురుమయ్య తెలిపారు.
