ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపేదల ఆడబిడ్డల పెళ్లికి అండగా నిలిచే ఈ పథకాలను రద్దు చేయకుండా సమర్థవంతంగా అమలు చేయాలి

పేదల ఆడబిడ్డల పెళ్లికి అండగా నిలిచే ఈ పథకాలను రద్దు చేయకుండా సమర్థవంతంగా అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

– కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పేదల సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు చేస్తున్న కుట్రను తీవ్రంగా ఖండిస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా,
– బీఆర్ఎస్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ సీడిసి చైర్మన్ బీసం చెన్న కేశవరెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ
న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు
18.2026.
కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, రైతు భీమా పథకాలను రద్దు చేస్తే సహించమని,
వెంటనే హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ ద్వారా కౌంటర్,పిటిషన్,దాఖలుచేయించి,ఎత్తివేయించాలని,లేనిపక్షంలోకాంగ్రెస్,ప్రభుత్వంగద్దెదిగాలని,బీఆర్ఎస్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ సీడిసి చైర్మన్ బీసం చెన్న కేశవరెడ్డి అన్నారు. సోమవారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తకోటలో మానవహారం రాస్తారోకోల పాల్గొనివిజయవంతం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, మాజీ సీడిసి చైర్మన్ బీసం చెన్న కేశవరెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉండడానికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలను రద్దు చేస్తే సహించమని, ఉద్యమాన్ని ఉధృతంచేసిపేదప్రజలపక్షానఉంటామనిహెచ్చరించారు.ఇప్పటికేరైతుబీమాపథకంప్రీమియంచెల్లించకుండా చనిపోయిన 7.వెల 5.వందల రైతుకుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, వెంటనే ఆలస్యం చేయకుండా ప్రీమియoను చెల్లించి రైతు బీమా పథకంను కొనసాగించాలని అన్నారు.ఈ
కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షులు గిన్నే కొండారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయ్యన్న,మాజీ ఎంపిటిసి సత్యం యాదవ్, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాసులు, ఎద్దుల నాగేష్, కౌన్సిలర్లు ఎరుకలి తిరుపతయ్య, ముంత మంజుల రామకృష్ణ, అడ్వకేట్ యాదగిరి, గాడీల ప్రశాంత్, సాదిక్ అలీ, సంధ్య శ్రీను, యుగంధర్ రెడ్డి,పసుపుల నెహ్రు, గోపాల్ నాయక్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!