సినీ హీరో సుమన్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ
పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: సినీ హీరో సుమన్
పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: తాటి వెంకటేశ్వర్లు
పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: కాసాని పద్మ
బడుగు బలహీన వర్గాలకు పాపన్న గౌడ్ ఆత్మగౌరవ ప్రతీక: డా. భూక్యా ఉదయ జ్యోతి
పొలిటికల్ పవర్,అశ్వారావుపేట,ఆగస్టు 18:
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా అశ్వారావుపేట పట్టణంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సినీ హీరో సుమన్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బూర్గంపహాడ్–అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సినీ హీరో సుమన్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యం, సాహసం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. పాపన్న గౌడ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ ఒక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదని, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన గొప్ప ప్రజా యోధుడని అన్నారు. యువత ఆయన జీవిత చరిత్రను తెలుసుకుని పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేటలో పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కాసాని పద్మ మాట్లాడుతూ.. పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. డా. భూక్యా ఉదయ జ్యోతి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు పాపన్న గౌడ్ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచారని అన్నారు.
కార్యక్రమంలో కాసాని చంద్రమోహన్, ప్రసాద్ రావు, జుజ్జురపు శ్రీరామ్మూర్తి, మాజీ టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ, మోటూరి మోహన్, వీరాజు, శివ, ఉమేష్, గోవింద్ గౌడ్, గాదెగోని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌడ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ‘జై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్’ నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగింది.
