– తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు18.2026.
రజక వృత్తిదారులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి వృత్తిదారులకు ఊరట కల్పించాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కేంద్రంలోని ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్,పథకాన్నిప్రస్తుతప్రభుత్వంకొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, అయితే ప్రభుత్వంఏర్పడినతర్వాతఈపథకానికిసంబంధించినవిద్యుత్,బకాయిలనుసకాలంలోచెల్లించకపోవడంతోవృత్తిదారులపైవేలరూపాయలబిల్లులుపేరుకుపోయాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.అనంతరం రాసాలలక్ష్మయ్యమాట్లాడుతూప్రజాసంక్షేమప్రభుత్వంలో రజక వృత్తిదారులు విద్యుత్ బిల్లుల విషయంలో తీవ్ర అయోమయానికి గురవుతున్నారని అన్నారు. బకాయిలు పెరిగిపోతుండటంతో భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోతే తమ ఆస్తులను తాకట్టు పెట్టాల్సినపరిస్థితివస్తుందేమోనని వృత్తిదారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తామని వృత్తిదారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను గతంలోనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలోపట్టణ అధ్యక్షులు పేరూరి బాలస్వామి,పట్టణ గౌరవ అధ్యక్షులు రాసాల లక్ష్మయ్య, ఇటిక్యాలబండలయ్య, భవాణి చంద్రయ్య ,బి.రవి , బి.శ్రీను ,బి.వెంకటేష్ రిటైర్డ్.ఆర్టీసీ,పేరూరినాగరాజు,ఆర్.కురుమయ్య,కె.మహేష్ ,ఆర్. నాగరాజు,అప్పరాల శివయ్య తదితరులు పాల్గొన్నారు.

