ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఅణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అదనపు...

అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖిమ్యా నాయక్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 19.2026.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖిమ్యా నాయక్ అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, అదనపు కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి ఎదిగి ప్రజల హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడిన గొప్ప యోధుడిగా చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.సర్వాయి పాపన్న గౌడ్ ప్రజల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సామాజికఅసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. తన ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ప్రజా సంక్షేమం పట్ల అంకితభావంతో నాటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.అన్యాయాన్ని ఎదిరించి, ఆత్మగౌరవం కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. ఆయన చూపిన ధైర్యం, సమానత్వం, ఆత్మగౌరవం వంటి విలువలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అదనపు కలెక్టర్ అన్నారు. ఆయన జీవిత చరిత్ర, సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న జీవితంపై సామాజిక చైతన్య కళాకారుడు రాజారాం ప్రకాష్ పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఇంచార్జి బీసీ సంక్షేమ శాఖ అధికారి మధు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మహనీయుల ఉత్సవ కమిటీ నాయకులు గంధం నాగరాజు, వెంకటేష్, గౌడ సంఘం నాయకులు, ఇతర ప్రజాసంఘాల, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!