ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తివనపర్తిలో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు

వనపర్తిలో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు

📰 Generate e-Paper Clip


–వృద్ధాశ్రమంలోపండ్లపంపిణీ,ఫోటోగ్రాఫర్లంతా ఐక్యంగా ముందుకు సాగాలి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు20.2026. జిల్లా పట్టణ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాలిటెక్నిక్‌ గ్రౌండ్‌లో ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్రపటానికి ఫోటోగ్రాఫర్లు పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు.అనంతరంఅసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు ముంత నిర్మల జెండాను ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాము సమక్షంలో గౌరవసలహాదారులురవి,స్వాతి,శ్రీను,లక్ష్మి శ్రీను, జెబ్బర్, వెంకటేష్, శేఖర్, సుల్తాన్ తదితరులు లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వల్లభ్‌నగర్‌లోని సరోజ్ సూద్ వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగాఅసోసియేషన్ అధ్యక్షుడు రాము మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంసందర్భంగాఫోటోగ్రాఫర్లందరికీశుభాకాంక్షలు తెలిపారు. ఫోటోగ్రాఫర్లంతా ఐకమత్యంగా ఉండటం వల్ల ప్రభుత్వ సహకారంతో యూనియన్ భవననిర్మాణానికిస్థలంసాధించగలిగామనిపేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తునసభనిర్వహించిఫోటోగ్రాఫర్లభవనాన్నిప్రారంభించేందుకుచర్యలుతీసుకుంటామనితెలిపారు. కార్యక్రమంలో క్యాషియర్లు బాలు, శ్రీను,ఉపాధ్యక్షుడు యాదగిరి, నిరంజన్, సహాయ కార్యదర్శులు ఈశ్వర్, నజీర్, కుటుంబ భరోసా ఇన్‌చార్జి సూరి, సోషల్ మీడియా ఇన్‌చార్జి శ్యామ్‌లాల్, ప్రధానకార్యదర్శులు, అసోసియేషన్ సభ్యులు, పట్టణంలోని ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!