ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeతెలంగాణఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్‌

ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్‌

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పీఎన్‌9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ జక్కిడి ప్రభాకర్‌రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు చేపట్టింది. కులాల పేరుతో పలువురిని దూషించిన ఘటనకు సంబంధించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు, కులాల పేరుతో వ్యక్తులను దూషించినట్లు వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జక్కిడి ప్రభాకర్‌రెడ్డి సస్పెన్షన్‌తో ఎల్బీనగర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!