ePaper
Friday, August 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

27 సార్లు పొడిచి ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన టెన్త్ క్లాస్ విద్యార్థులు

 

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని నిర్ధారించిన పోలీసులు.

గంజాయికి అలవాటు పడి, విచ్చలవిడిగా జల్సాలకు అలవాటుపడి, డబ్బుల కోసం హత్య చేసినట్లు నిర్ధారణ. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు అరెస్ట్. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య. ఆమె స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి అంతకంటే ముందే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి చొరబడ్డ నిందితులు. ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లిన సమయంలో వంటగదిలో దాక్కున్న నిందితులు. ఆమె ఫ్రెష్ అయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే వెనకాల నుంచి వచ్చి కత్తితో 27 సార్లు పొడిచి దాడి. ఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల డబ్బును ఎత్తుకెళ్లిన విద్యార్థులు. ఆ డబ్బుతో హైదరాబాద్‌లో జల్సాలు, ఎవరికీ డౌట్ రాకుండా సీసీ కెమెరాల్లో పడకుండా జాగ్రత్తలు. ఎట్టకేలకు కనిపెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!