ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeతెలంగాణకళాకారులను గౌరవించడం మన సంస్కృతి

కళాకారులను గౌరవించడం మన సంస్కృతి

📰 Generate e-Paper Clip

ఎస్. జానకి గాన ప్రస్థానం నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకం

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్రా బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 20 2026: హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గాన సభ స్థలంలో ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ సినీ గాయని ఎస్. జానకి ఆత్మీయ పురస్కారాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, మరియు తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జానకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ…. ప్రముఖ సినీ గాయని జానకమ్మ తన 85 సంవత్సరాల జీవిత కాలంలో 61 సంవత్సరాలల్లో48 వేల పాటలు 20 భాషల్లో పాడటం ఎంతో గర్వించదగ్గ విషయం అని అన్నారు. తన మధురమైన గానంతో దశాబ్దాలుగా కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన గొప్ప గాయని ఎస్. జానకి అని అన్నారు. ఆమె కళా సేవలు, సంగీతానికి చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి అని అన్నారు. ఆత్మీయ పురస్కారాల ద్వారా ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయం, కళాకారులను గౌరవించడం మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడమే అని నేను భావిస్తున్నాను అని తెలిపారు. కళాకారులకు ఇలాంటి పురస్కారాలు మరింత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని అందిస్తాయి అని పేర్కొన్నారు. ఎస్. జానకి గాన ప్రస్థానం నేటి తరానికి కూడా గొప్ప స్ఫూర్తిదాయకం అని అన్నారు. పురస్కారాలు అందుకున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. ఈ ఆత్మీయ పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసిన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ గాయని ఆమని, ప్రముఖ గాయకులు పాటలు పాడి అలరించారు. కార్యక్రమంలో సంగీత అభిమానులు, కృపాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!