పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: పెద్దమందడి మండలంలోని అల్వాల గ్రామంలో గురువారం ఇందిరమ్మ గృహాల రెండో విడత వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి సైదులు, గ్రామ సర్పంచ్ రాజా మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారుల ఇంటి స్థలాలను పరిశీలించారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి అర్హులైన లబ్ధిదారుల ఇంటి స్థలాల పరిస్థితి, అందుబాటులో ఉన్న స్థలం, ఇతర వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి గృహ సదుపాయం అందేలా వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ గృహాలకు అర్హులైన నిరుపేదల 7 ఇండ్లలో సర్వే నిర్వహించడం జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు ఇందిరమ్మ గృహాలు అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని గ్రామ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహాల పథకం అమలుతో పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.
