ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తి18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం

యూత్ కాంగ్రెస్ NSUI ఆధ్వర్యంలో

ఫారం-6ను విడుదల చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వనపర్తి రాజీవ్ గాంధీ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, యువతతో కలిసి ఫారం-6ను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మాట్లాడుతూ… దేశ యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది రాజీవ్ గాంధీ నాయకత్వంలోని ప్రభుత్వం అని గుర్తు చేశారు. యువతకు దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రజాస్వామ్య హక్కును అందించాలన్న రాజీవ్ గాంధీ దూరదృష్టికి ఇది నిదర్శనమని అన్నారు. అనంతరం రాజ్యాంగంలోని 61వ సవరణ ద్వారా ఓటు వయస్సు 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గింది. ఓటు హక్కు ప్రతి పౌరుడి చేతిలో ఉన్న వజ్రాయుధం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మన ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే శక్తి ఓటు ద్వారా ప్రజలకు లభిస్తుందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు పొందుతున్న యువత తమ బాధ్యతను గుర్తించి ఓటు నమోదు చేసుకోవడంతో పాటు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఒక్క ఓటు చిన్నదిగా కనిపించినా.. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే గొప్ప శక్తి దానికి ఉందని మేఘారెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, అభివృద్ధి కోసం పనిచేసే మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం ప్రతి ఓటరి బాధ్యత అని స్పష్టం చేశారు. యువత దేశ భవిష్యత్తుకు దిక్సూచి లాంటిదని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో యువత పాత్ర కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ యువతపై ఉంచిన నమ్మకాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకైన భాగస్వాములు కావాలని కోరారు. యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థల పరిధిలో 18 ఏళ్లు నిండిన యువతను గుర్తించి ఫారం-6 ద్వారా ఓటు నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. అర్హత ఉన్న ఎవ్వరు కూడా ఓటు హక్కుకు దూరం కాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య,NSUI నాయకులు, శ్రీకాంత్, దివాకరు యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!