ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా

📰 Generate e-Paper Clip

-ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక/ పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల్లో ఆందోళనకు కారణమవుతున్న జీవో నెంబర్ 97 పాలిటెక్నిక్ విద్యాసంస్థలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే చర్యలను నిలిపివేయాలని కోరుతూ వనపర్తి పాలిటెక్నిక్ విద్యార్థులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన విద్యార్థులు జీవో నెంబర్ 97తో తమ విద్యా భవిష్యత్తుపై ఏర్పడుతున్న అనుమానాలు, శక్తి స్కీమ్‌కు సంబంధించిన అంశాలు, పాలిటెక్నిక్ విద్యాసంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలపై తమ ఆందోళనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే జీవో నెంబర్ 97, శక్తి స్కీమ్‌కు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారి భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తాను” అని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!