ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిశ్రీ వీరభద్ర స్వామి దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దంపతులు

శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దంపతులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 21 2026: పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠతో పాటు శ్రీ పోచమ్మ అమ్మవారి నాభి శిలల పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వాసంతి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మరియు పోచమ్మ అమ్మవారి నాభి శిలల పునఃప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం బసవ కళ్యాణ ఆశ్రమ పీఠాధిపతి, మహా తపస్వి పూజ్య శ్రీ షడా బసవలింగ అవధూత స్వామి వారి ఆశీస్సులను మాజీ మంత్రి దంపతులు స్వీకరించారు. స్వామివారితో ఆధ్యాత్మిక విషయాలపై మాట్లాడి, వారి ఆశీర్వాదం పొందారు. ఈ పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ పోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, గ్రామంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, పాడిపంటలతో సమృద్ధి నెలకొనాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆకాంక్షించారు. అలాగే ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను గ్రామ ప్రజలు ఐకమత్యంతో కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. భక్తుల విశ్వాసం, గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఆలయాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!