ePaper
Saturday, August 22, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఆగస్టు 28నే రాఖీ పండుగ.. పండితుల స్పష్టత!

Aug 22, పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఆగస్టు 28నే రాఖీ పండుగ.. పండితుల స్పష్టత! శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై ఆగస్టు 28 ఉదయం 9:48 గంటల వరకు ఉండటంతో.. ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 28న జరుపుకోవాలని పండితులు స్పష్టం చేశారు. రాఖీ కట్టడానికి ఆగస్టు 28 ఉదయం 6:23 నుంచి 9:48 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 12:14 నుంచి 1:05 గంటల వరకు (అభిజిత్ ముహూర్తం) అత్యంత శుభప్రదమైన సమయాలు. ఈ ఏడాది భద్ర కాలం సూర్యోదయానికి ముందే ముగిసిపోవడంతో ఆగస్టు 28న రోజంతా రాఖీలు కట్టుకోవడానికి అనుకూలమైన సమయమని పండితులు వెల్లడించారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!