పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ ఆగస్టు 24 2026: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న కీలక భూమిని స్వాధీనం చేసుకోనున్న ప్రభుత్వం, హైదరాబాద్ – ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న బస్ భవన్ సమీపంలోని అత్యంత కీలకమైన ఆరున్నర ఎకరాల ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం, గతంలో హైదరాబాద్–3 డిపోగా ఉన్న ఈ స్థలాన్ని, ప్రస్తుతం ఆర్టీసీ కొత్త బస్సుల ఛాసీలు నిలిపే యార్డుగా మార్చిన యాజమాన్యం, అయితే ముషీరాబాద్–1 డిపోలో పాత భవనాలు ఉన్నాయని, ఆ స్థలాన్ని ఇందిరమ్మ ఇండ్ల కోసం తీసుకోవాలని, ఈ స్థలంలో కొత్త భవనాలు ఉన్నాయని ప్రభుత్వానికి లేఖ రాసిన ఆర్టీసీ, ఆర్టీసీ రాసిన లేఖపై ఇంతవరకు స్పందించని ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఆర్టీసీ ఆస్తులను కేంద్రం తొమ్మిదో షెడ్యూల్లో పెట్టిందని, ఆ అంశం తేలేంత వరకు ఈ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కుదరదని చెప్తున్న నిపుణులు
