ePaper
Saturday, August 29, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఅక్క తమ్ముళ్ల  అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

అక్క తమ్ముళ్ల  అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు29.2026.అక్కతమ్ముళ్ల  అనుబంధంజన్మజన్మలసంబంధమంటూఅక్కతమ్ముళ్లకురాఖీకడుతూకాపాడుకోసాగారు. శుక్రవారం రాఖీ పౌర్ణమిసందర్భంగా వనపర్తి  జిల్లాలోని వివిధ మండలాల్లో, గ్రామాల్లో అన్నయ్యలకు, తమ్ముళ్లకు చెల్లెళ్లు అక్కలు రాఖీలు కడుతూ వారి ఆశీర్వాదాలుతీసుకొనిరాఖీపండుగను వైభవంగా జరుపుకున్నారు. రాఖీపండుగసందర్భంగా జిల్లాలో, మండలాలలో, గ్రామాలలో ప్రశాంత వరణం నిలుకొని వివిధ పట్టణాలలోనివసిస్తున్నఅక్కాచెల్లెళ్లు అందరుకూడాగ్రామాలకుచేరుకునివారిఅన్నయ్యలకు తమ్ముళ్లకురాఖీలుకట్టడంతోఒకపండుగవాతావరణంలో మారిపోయింది. ఇతర రాష్ట్రాలలో, పట్టణాలలో ఉన్న చెల్లెళ్లు వారి వారి అన్నయ్యలకు రాఖీలు పంపి రాఖీలు కట్టుకోమని ఆశీర్వదించమని కోరారు. కొత్తకోట మండల కేంద్రంలోని మహానంద మల్కిదాస్ ఆచల గురు ఆశ్రమం లో రాఖీ పండుగ సందర్భంగా అన్నాలకు చెల్లెళ్లు, తమ్ముళ్లకు అక్కయ్యలు రాఖీలు కట్టి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అందులో  భాగంగానే యస్.తేజస్విని, యం. వైష్ణవి, తమ్ముళ్లు టి.గ్రీత్ వీక్,జున్ను లకు,అనంతరం టి.తిరుపతమ్మ,యస్.వెంకటేశ్వరమ్మ, సౌభాగ్య లక్ష్మి, శంకరమ్మలు అన్న డి.ఈశ్వర్,తమ్ముళ్లు డి.శివశంకర్,డి.శివరాంలకురాఖీకట్టిమంగళహారతులు ఇచ్చి, స్వీట్ తినిపిస్తూ  ఆనందంతో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో డి. భవ్య శ్రీ,యస్.ఈశ్వర్,యం. లక్మన్న తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!